Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోర్ నర్సాపూర్ లో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

Follow Udayam on Google
madhu Sep 06, 2026 1:03 PM ములుగుGeneral
బోర్ నర్సాపూర్ లో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు - Udayam
మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు, భక్తులు నెత్తిన బోనాలు పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వేడుకలతో ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది.

Comments

G
Loading comments...