వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా రాజాం YCP ఇన్ చార్జ్ తలే రాజేష్ గురువారం ఎన్నికల డీటీ ని కలిసారు. ఈ సందర్భంగా పట్టణంలోని 133, 134, 135 పోలింగ్ బూత్‌లలో స్థానికేతరుల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా మ్యాపింగ్ చేశారని ఆరోపించారు.
ఈ మేరకు బోగస్ ఓట్లపై సమగ్ర విచారణ జరిపి వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా, పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని వినతిపత్రం అందజేసారు.
Comments
Loading comments...

