వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరుకు చెందిన అంతర్జాతీయ పారా స్విమ్మర్ బలగ గణేశ్ బోడెన్సీ సరస్సులో సుమారు 12 కి.మీ దూరాన్ని 5 గంటల 14 నిమిషాల్లో ఈదారు. జర్మనీ-స్విట్జర్లాండ్ మధ్యనున్న ఈ సరస్సులో 16.5 డిగ్రీల చలిలో వెట్‌సూట్ లేకుండానే ఈత పూర్తి చేశారు.
ఈ సరస్సును ఈదిన తొలి భారతీయుడిగా గణేశ్ గుర్తింపు పొందారు. డీఎస్సీ-2024లో క్రీడా కోటాతో ఎస్జీటీగా ఎంపికైన ఆయనను మంత్రి నారా లోకేశ్ అభినందించారు.
Comments
Loading comments...

