Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ మేయర్ రేసులో బొండా సిద్ధార్థ

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 10:26 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ మేయర్ రేసులో బొండా సిద్ధార్థ - Udayam
విజయవాడ మేయర్ అభ్యర్థిత్వం కోసం బొండా సిద్ధార్థ పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే బొండా ఉమా గురువారం తన కుమారుడు సిద్ధార్థతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. సిద్ధార్థ బయోడేటాను సీఎంకు అందజేసి మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ అభ్యర్థిత్వంపై సీఎం సానుకూలంగా స్పందించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...