వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా బొగత జలపాతాన్ని ఆదివారం వేలాది మంది పర్యాటకులు సందర్శించారు. హైదరాబాద్, వరంగల్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో జలపాతం పరిసరాలు సందడిగా మారాయి.
వరద నీటి ప్రవాహాన్ని తిలకిస్తూ సందర్శకులు స్వీయ చిత్రాలు దిగారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈత కొలనులో సందడి చేయగా, పిల్లలు పార్కులో ఆటలతో ఉల్లాసంగా గడిపారు.
Comments
Loading comments...

