వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసంలో హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబసభ్యులతో కలిసి శ్రావణమాస వ్రతం నిర్వహించారు. పూజ అనంతరం మహిళలకు చీరలు, వాయినాలు అందించారు.
నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అనిత తెలిపారు. వచ్చే నెల 2న నియోజకవర్గానికి పోలవరం నీళ్లు వస్తాయని, సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారని వెల్లడించారు.
Comments
Loading comments...

