Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిసి వెల్ఫేర్ హాస్టల్ ను సందర్శించిన జడ్జి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 9:36 PM విజయనగరంGeneral
బిసి వెల్ఫేర్ హాస్టల్ ను సందర్శించిన జడ్జి - Udayam
విజయనగరం జిల్లా గజపతినగరం కోర్టు న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్ శనివారం బొండపల్లి మండలం దేవుపల్లి BC వెల్ఫేర్‌ హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్‌ గదులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, ఇతర సౌకర్యాలపై ఆరా తీసారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని , అవసరమైన సౌకర్యాలపై సూచనలు చేసారు. కార్యక్రమంలో ప్యానల్‌ లాయర్‌ ఆదినారాయణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...