వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్‌కేసర్‌లోని వందన హోటల్‌లో పనీర్ బిర్యానీ ఆర్డర్ చేసిన కుటుంబానికి అందులో బొద్దింకలు కనిపించడంతో ఆందోళన వ్యక్తం చేశారు. తిన్న కొద్దిసేపటికే వాంతులు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు.
విషయాన్ని హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానమిచ్చారని బాధితులు ఆరోపించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

