వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ పట్టణంలో పట్టపగలే బైక్ చోరీలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఏటిగడ్డ తండాకు చెందిన గూగులోతు రాము, మహమ్మద్ అహ్మద్ పాషా బైక్‌లు చోరీకి గురయ్యాయి.
చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బాధితులు ఘటనలపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుస చోరీలతో బైక్ యజమానుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...

