వార్తలకు తిరిగి వెళ్లండి

మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో రజక కమిటీ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె ఒక కులానికి పరిమితం కాదని, మహిళాలోకానికి స్ఫూర్తిదాయకమని తిరుమలేష్ అన్నారు.
దొరల దౌర్జన్యాలను ఎదిరించి పేదల కోసం పోరాడిన ధీరవనితగా ఐలమ్మను కొనియాడారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

