వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపి ఎస్టి మోర్చా నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులుగా జన్నారం మండలానికి చెందిన సంతోష్ నాయక్ నియమితులయ్యారు. శనివారం బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. మండలంలోని హాస్టల్ తండాకు చెందిన సంతోష్ నాయక్ బిజెపిలో సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు.
పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయనను నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడుగా నియమించారు. సంతోష్ నాయక్ ను బిజెపి నాయకులు, కార్యకర్తలు అభినందించారు
Comments
Loading comments...

