Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన

Follow Udayam on Google
K.Venkatesh Aug 31, 2026 6:11 PM ఖమ్మంGeneral
బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన - Udayam
ఖమ్మం 29వ డివిజన్ ప్రకాష్ నగర్ లో కాటన్ మార్కెట్ నుంచి శ్రీనివాస్ నగర్ మీదుగా దంసలాపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ముందుగా ప్రకాశ్ నగర్ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రహదారులతోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామం, నగరంలో మౌలిక సదుపాయాలు కల్పన ప్రభుత్వ బాధ్యత అన్నారు.

Comments

G
Loading comments...