వార్తలకు తిరిగి వెళ్లండి

గార్లదిన్నె మండల కేంద్రంలో సోమవారం ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు.
వారు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు, బీసీల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషి చేశారని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

