Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరెల్లిలో ముత్యాలమ్మ తల్లి బోనాలు

Follow Udayam on Google
madhu Aug 30, 2026 12:13 PM ములుగుGeneral
బీరెల్లిలో ముత్యాలమ్మ తల్లి బోనాలు - Udayam
ములుగు జిల్లా మంగపేట మండలం బీరెల్లి గ్రామంలో ఆదివారం శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు, భక్తులు నెత్తిన బోనాలు పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వేడుకల సందర్భంగా ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది.

Comments

G
Loading comments...