వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం వెన్నచేడ్‌లో గొడుగు వెంకటయ్య, బాజర్ల మల్లప్ప మృతి విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డా. వెన్న ఈశ్వరప్ప కుటుంబాలను పరామర్శించారు. సభ్యులకు మనోధైర్యం కల్పించారు.
ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన ఈశ్వరప్పకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

