వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తూ నిరుపేదలకు చెక్కులు అందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావుతో పాటు మండల, గ్రామాల నాయకులు, కార్యకర్తలు, పార్టీలకతీతంగా స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

