వార్తలకు తిరిగి వెళ్లండి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో పెద్ద పులులు స్వేచ్ఛగా విహరిస్తూ పర్యాటకులకు కనువిందు చేశాయి. శనివారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సఫారీకి వెళ్లిన పర్యాటకులకు అకస్మాత్తుగా పెద్ద పులులు రోడ్డు దాటుతూ కనిపించడంతో వారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు.
అమ్రాబాద్ దట్టమైన అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇస్తుండటంతో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అవి ఇలా స్వేచ్ఛగా తిరగడం పట్ల అటవీ శాఖ అధికారులు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

