వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు హకీంపేట-లగచర్ల తరహాలో పరిహారం, పునరావాస సాయం అందించాలని భూ నిర్వాసితుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు, ప్రత్యేక పెన్షన్, ఇల్లు, ప్లాటు, విద్యార్థులకు గురుకులాల్లో సీట్లు, పాడి పశువుల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

