వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి: వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులతో సమన్వయం పాటించాలని డీసీపీ బి.రామ్‌రెడ్డి సూచించారు. డీసెంట్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు.
ట్రాఫిక్, విద్యుత్ సమస్యల్లేకుండా, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. డీజేలు, మద్యపానం, గందరగోళాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు.
Comments
Loading comments...

