వార్తలకు తిరిగి వెళ్లండి

బాదంపూడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమడోలు మండలం కోడూరుపాడుకు చెందిన దొరరాజు మృతిచెందాడు. తేతలి నుంచి బైక్‌పై వస్తుండగా పెద్దవెలమిల్లి వంతెన వద్ద ఐరన్ పైపులు, రేకుల లోడుతో వెళ్తున్న ట్రక్‌లోని రేకులు దొరరాజుకు బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఘటనపై చేబ్రోలు ఎస్‌ఐ సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

