Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రతకు సీసీ కెమెరాలు అవసరం: రూరల్ సీఐ కృష్ణ

Follow Udayam on Google
సందీప్ Jul 08, 2026 3:32 PM నిర్మల్ General
భద్రతకు సీసీ కెమెరాలు అవసరం: రూరల్ సీఐ కృష్ణ - Udayam
సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో సీఐ కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సమావేశం జరిగింది. గ్రామ భద్రతకు ప్రధాన కూడళ్లు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా నేరాల నియంత్రణ, దర్యాప్తు వేగవంతమవుతాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ వనమహోత్సవంలో భాగంగా అరె మైసమ్మ ఆలయ ప్రాంగణంలో పోలీసులు, గ్రామస్తులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్, సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ పోశెట్టి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, గ్రామస్తులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...