Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

Follow Udayam on Google
B RAJESH Sep 03, 2026 8:48 PM విజయనగరంGeneral
భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య - Udayam
రామభద్రపురం మండల కేంద్రం కనిమెరక వీధికి చెందిన గేదెల రమేశ్ (39) మద్యానికి బానిస కావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన గురువారం గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆపస్మారక స్థితిలో ఉన్న సోదరుడిని చూసిన సోదరి లక్ష్మి బాడంగి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ జ్ఞానప్రసాద్ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...