వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు చేరడంతో గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుతో పాటు వాగులు, వంకల నుంచి వరదనీరు గోదావరిలోకి చేరుతోంది.
జన్నారం మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారక, గూడెం ప్రాంతాల్లో నది రెండు ఒడ్డులను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి వైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

