వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో పాటు చమురు ధరలు తగ్గడం సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్ 1,533 పాయింట్లు ఎగబాకి 74,315 వద్ద స్థిరపడింది.
జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ తేదీల ప్రకటనతో రిలయన్స్ షేర్లు దూసుకెళ్లగా, అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు తెలిపారు.
Comments
Loading comments...

