Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రిలయన్స్‌ పవర్‌ రూ.2,033 కోట్ల ఆస్తులు జప్తు

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 6:36 PM జాతీయంవాణిజ్యం
రిలయన్స్‌ పవర్‌ రూ.2,033 కోట్ల ఆస్తులు జప్తు - Udayam
ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు విచారణలో భాగంగా రిలయన్స్‌ పవర్‌కు చెందిన రూ.2,033 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వీటిలో బ్యాంకు నిల్వలు, ససాన్‌ పవర్‌ షేర్లు ఉన్నాయని వెల్లడించింది. విదేశీ కంపెనీలకు ఇచ్చిన రూ.2,101.46 కోట్ల రుణాలను రైటాఫ్‌ చేయడంపై సెబీ చర్యల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలను ఖండించిన రిలయన్స్‌ పవర్‌.. వాటాదారుల ప్రయోజనాల కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Comments

G
Loading comments...