వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఉత్తమ స్కూలుగా అభివృద్ధి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కనీసం ఐదు ఎకరాల స్థలం, క్రీడా మైదానం, రవాణా సౌకర్యం వంటి నిర్దేశిత ప్రమాణాలున్న 500 మందికి పైగా విద్యార్థులున్న హైస్కూళ్లను ఎంపిక చేయాలని ఇన్‌ఫ్రా కమిషనర్ రంజిత్ బాషా ఆదేశించారు.
ఈ పాఠశాలల్లో అత్యాధునిక క్లాస్‌రూములు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇండోర్ స్టేడియం వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు జిల్లాకో జూనియర్ కాలేజీని, ఐదేసి చొప్పున కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలను కూడా ఎంపిక చేసి నివేదికలు అందించాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
