Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:54 PM నల్గొండGeneral
బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ - Udayam
మునుగోడు మండలంలోని గ్రామాల్లో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్న 30 మంది నిర్వాహకులను పోలీసులు తహశీల్దార్‌ ఎదుట బైండ్‌ ఓవర్‌ చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున బాండ్‌ తీసుకున్నట్లు ఎస్ఐ శోభన్‌బాబు తెలిపారు. గ్రామాల్లో మళ్లీ ఎవరైనా బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బెల్ట్‌ షాపుల నిర్వహణను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...