వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలం బెల్గాం గ్రామాన్ని కోతుల సమస్య వణికిస్తోంది. ఇళ్లలోకి చొరబడి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వానరాలను పారద్రోలేందుకు గ్రామస్తులు సరికొత్త ఉపాయం ఆలోచించారు. గ్రామంలో ఇనుప జాలి బోనును నిర్మించి గట్టి నిఘా పెట్టారు.
కోతులకు ఇష్టమైన రకరకాల తినుబండారాలను అందులో వేసి ఆశ చూపుతున్నారు. ఆహారం కోసం వచ్చే కోతులను ఇలా సులువుగా పట్టుకుని ఊరి నుంచి దూరంగా తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

