వార్తలకు తిరిగి వెళ్లండి

బేస్తవారిపేట మండల రైతులకు 35 శాతం సబ్సిడీపై జేజీ-11 రకం శనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ తెలిపారు. విత్తనాల కోసం అక్టోబర్ 7 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని చెప్పారు.
రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. మండలానికి 700 క్వింటాళ్ల విత్తనాలు మంజూరైనట్లు తెలిపారు.
Comments
Loading comments...

