వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మైనంపల్లి హనుమంతరావును పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలని దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నాయకులు దాడులకు దిగుతున్నారని విమర్శించారు. కేటీఆర్‌పై మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, తమ నాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన గుణపాఠం తప్పదని బాలరాజు యాదవ్ హెచ్చరించారు.
Comments
Loading comments...

