Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైంసా శివరామాలయానికి రూ.50 లక్షల మంజూరు

Follow Udayam on Google
సందీప్ Jul 16, 2026 2:15 PM నిర్మల్ General
బైంసా శివరామాలయానికి రూ.50 లక్షల మంజూరు - Udayam
బైంసా పట్టణంలోని రామ్‌లీలా మైదానంలో నిర్మించనున్న శివరామాలయానికి రూ.50 లక్షల నిధులు మంజూరైనట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. గురువారం తన నివాసంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు ఆయన మంజూరు పత్రాన్ని అందజేశారు. ఎన్నికల హామీ మేరకు ఈ నిధులు మంజూరు చేయించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిధులు కేటాయించినందుకు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...