Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిశువు కిడ్నాప్ కేసు ఛేదనం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 03, 2026 4:45 PM బాపట్లGeneral
శిశువు కిడ్నాప్ కేసు ఛేదనం - Udayam
బాపట్ల జిల్లా చీరాలలో ఆరు నెలల శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. తల్లి పక్కన నిద్రిస్తున్న పాపను అపహరించిన నిందితులు సంజీవరావు, శ్రీనులతో పాటు టంగుటూరుకు చెందిన ఆదినారాయణ, తిరుమల దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంతానం లేని కారణంతోనే ఆదినారాయణ దంపతులు ఈ కిడ్నాప్‌నకు సూత్రధారులుగా మారినట్లు విచారణలో తేలింది. శిశువును తెచ్చి అప్పగిస్తే రూ.1 లక్ష ఇస్తామని వారు నిందితులకు ఆఫర్ ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు.

Comments

G
Loading comments...