వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల జగదీష్ శుక్రవారం బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారికి తాను స్వయంగా నేసిన అక్షరమాల పట్టుచీరను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య అమ్మవారికి చీరను అందజేశారు. 6.30 సెంటీమీటర్ల పొడవు, 650 గ్రాముల బరువున్న ఈ చీరను 15 రోజులపాటు శ్రమించి చేనేత మగ్గంపై నేసినట్లు జగదీష్ తెలిపారు.
Comments
Loading comments...

