Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జొకోవిచ్‌ అవుట్‌.. స్ట్రఫ్‌ సంచలన విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 12:22 PM జాతీయంక్రీడలు
జొకోవిచ్‌ అవుట్‌.. స్ట్రఫ్‌ సంచలన విజయం - Udayam
ఏటీపీ 500 బాసెల్‌ టెన్నిస్‌ టోర్నీలో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు షాక్‌ తగిలింది. రెండో రౌండ్‌లో జర్మనీ ఆటగాడు జాన్‌-లెన్నార్డ్‌ స్ట్రఫ్‌ 6-7(4), 7-5, 7-6(5)తో అతడిని ఓడించాడు. 2 గంటల 35 నిమిషాల పాటు సాగిన పోరులో స్ట్రఫ్‌ అద్భుతంగా పుంజుకుని విజయం సాధించాడు. జొకోవిచ్‌పై ఎనిమిది పరాజయాల తర్వాత స్ట్రఫ్‌కు ఇదే తొలి గెలుపు.

Comments

G
Loading comments...