వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల ఏరియా వైద్యశాలలో ఓపీ చీటీల కోసం రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపీ కేంద్రంలో ఇద్దరు సిబ్బందికి గాను ఒక్కరే విధులు నిర్వర్తిస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోందని మండిపడుతున్నారు.
రోగుల రద్దీకి అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచడంతో పాటు అదనంగా మరో ఓపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

