వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వడ్రంగి సంఘం వద్ద తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖాలేక్, కోఆప్షన్ సభ్యురాలు కమర్ సుల్తానా గౌస్, కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

