వార్తలకు తిరిగి వెళ్లండి
అయ్యప్ప భక్తుల సేవా కార్యక్రమం
Harika Jun 22, 2026 7:02 AM వికారాబాద్ 1 viewsabout 2 hours ago

అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో సోమవారం అడ్డా కూలీలు, బాటసారులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.
స్వామి వారి భక్తులు ప్రతి నెలా ఇలాంటి ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు బసవరాజు, మనోజ్ గౌడ్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...