వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిని పురస్కరించుకుని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చవితి రోజున 25 వేల నుంచి 30 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్లు, విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేశారు.
14 నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఉచిత దర్శనం, ప్రసాదం, అన్నప్రసాదం అందించనున్నారు.
Comments
Loading comments...

