Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజలో బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 1:03 PM జోగులాంబ గద్వాల్ General
అయిజలో బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం - Udayam
అయిజలో గురువారం సాయంత్రం నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మహిళా సంఘాల సభ్యులు పూలదండలు అల్లి బతుకమ్మలను పేర్చే పనిలో నిమగ్నమయ్యారు. సాయంత్రం పాత బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా బతుకమ్మ శోభాయాత్ర నిర్వహించి, అనంతరం బింగిదొడ్డి చెరువులో నిమజ్జనం చేయనున్నారు.

Comments

G
Loading comments...