Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించిన డీఎంహెచ్‌వో

Follow Udayam on Google
మానస శర్మ Aug 04, 2026 5:36 PM నెల్లూరుGeneral
తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించిన డీఎంహెచ్‌వో - Udayam
నెల్లూరు యూపీహెచ్‌సీ ఎన్‌బీటీ సెంటర్‌లో ఆశా డే కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత సందర్శించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి తల్లికి తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రసవం జరిగిన గంటలోపే శిశువుకు ముర్రుపాలు ఇవ్వాలని, అదే తొలి టీకాగా ఉపయోగపడుతుందని వివరించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్య సేవలు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...