వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలోని శిశు గృహం, జువైనల్ బోర్డు, సఖి కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య సందర్శించారు. పిల్లల సంరక్షణ, పరిశుభ్రత, క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.
సఖి కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్, న్యాయ సహాయం అందించాలని ఆమె తెలిపారు. బాలల హక్కులపై అవగాహన పెంపొందించడంతో పాటు అవసరమైన వారు ఉచిత న్యాయ సహాయం కోసం సంస్థను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

