Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం

Follow Udayam on Google
Harika Oct 27, 2026 10:24 AM విశాఖపట్నంGeneral
అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం - Udayam
విశాఖపట్నానికి చెందిన క్యాబ్ డ్రైవర్ సతివాడ చిన్నారావు (42) బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో ఆయన అవయవాలను దానం చేసేందుకు భార్య మధు ముందుకొచ్చారు. ఈ నిర్ణయంతో ఐదుగురికి కొత్త జీవితం లభించనుంది. తీవ్ర విషాదంలోనూ ఇతరుల ప్రాణాలు కాపాడాలన్న కుటుంబ నిర్ణయం అవయవదానంపై అవగాహన పెంచేలా నిలిచింది. చిన్నారావు కుటుంబానికి పలువురు సానుభూతి తెలుపుతూ, ఈ నిర్ణయం మరింత మందికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...