వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ రామకృష్ణ సూచించారు.ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కాలువలు దాటొద్దని, చెరువుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు.
అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వొద్దని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

