Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ రీ సర్వే నమోదులో లోటుపాట్లు ఉండొద్దు: కలెక్టర్

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:02 PM హన్మకొండ General
భూ రీ సర్వే నమోదులో లోటుపాట్లు ఉండొద్దు: కలెక్టర్ - Udayam
హనుమకొండ జిల్లాలో 70 గ్రామాల్లో చేపట్టిన భూ రీ సర్వే వివరాలను సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నమోదు ప్రక్రియను పరిశీలించారు. రీ సర్వే వివరాలు, ల్యాండ్‌ పార్సల్‌ మ్యాప్స్‌ (ఎల్పీఎం), రైతుల వారీగా పాలిగన్‌ మ్యాపుల నమోదును పరిశీలించారు. సర్వేను ఐదు దశల్లో చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...