Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాటు బాంబులతో దోపిడీ యత్నం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 09, 2026 7:25 AM చిత్తూరుGeneral
నాటు బాంబులతో దోపిడీ యత్నం - Udayam
చిత్తూరు జిల్లా తాళంబేడు పంచాయతీలోని ఫాంహౌస్‌లో దుండగులు నాటు బాంబులతో దోపిడీకి యత్నించారు. అడ్డుకున్న వాచ్‌మ్యాన్‌ ఆనందరావు గొంతు కోసి హత్య చేశారు. అనంతరం కిటికీపై నాటు బాంబులు విసిరారు. ఇంట్లోని వారు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. అంతర్రాష్ట్ర ముఠా పనై ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు, నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...