Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వామఖుతాలో కాల్పులు.. 11 మంది మృతి

Follow Udayam on Google
SAI NATH Sep 23, 2026 11:14 AM అంతర్జాతీయంGeneral
క్వామఖుతాలో కాల్పులు.. 11 మంది మృతి - Udayam
దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ సమీపంలోని క్వామఖుతాలో ఓ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో 11 మంది మృతి చెందారు. మంగళవారం రాత్రి జికో ప్రాంతంలో 14 మందిపై దాడి జరిగినట్లు సమాచారం. మృతుల్లో గర్భిణి మహిళ కూడా ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. ఘటనాస్థలిలో పోలీసులు ఆధారాలు సేకరిస్తూ.. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదు.

Comments

G
Loading comments...