Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళపై అత్యాచారయత్నం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 2:35 PM చిత్తూరుGeneral
మహిళపై అత్యాచారయత్నం - Udayam
చిత్తూరులో మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గంగాకాలనీకి చెందిన మహిళ తేనబండకు చెందిన వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నారు. అప్పు వసూలు చేసేందుకు ఆమె ఇంటికి వచ్చిన వ్యక్తి ఆమె భర్తను తోసేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు అని మహిళ ఆరోపించారు. చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై చిత్తూరు 2టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...