వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి పీఎస్ పరిధి పీర్జాదిగూడ రాఘవేంద్రకాలనీలో సత్యనారాయణ(51) హత్యకు గురయ్యాడు. భర్త వేధింపులతో విసిగిన భార్య సునీత ఈనెల 6న అతడి చేతులు, కాళ్లు చీరతో కట్టి కర్రతో కొట్టి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు సమాచారం ఉంది.
Comments
Loading comments...

