Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్లలో వైసీపీ నాయకుడిపై దాడి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:06 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గోరంట్లలో వైసీపీ నాయకుడిపై దాడి - Udayam
గోరంట్లలో వైసీపీ నాయకుడు, ఉపసర్పంచ్‌ రాజారెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది. ఆదివారం పొలంలో ఉన్న ఆయనపై ఐదుగురు దుండగులు కంట్లో కారం కొట్టి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...