Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాన్పూర్‌లో జవాన్‌ కుటుంబంపై దాడి

Follow Udayam on Google
Kiran Jun 11, 2026 1:01 AM జాతీయంక్రైమ్
కాన్పూర్‌లో జవాన్‌ కుటుంబంపై దాడి  - Udayam
జార్ఖండ్‌లో కోబ్రా దళంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్‌ కుటుంబంపై ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ మహారాజ్‌పూర్‌లో దారుణ దాడి జరిగింది. స్థానిక రౌడీషీటర్ తన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడని, తమకు తక్షణమే రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ సదరు జవాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. సైనికుడి కుటుంబానికే భద్రత లేకపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...